»Do You Know The Income From Fines Aadhaar Link With Pan
Pan-Adhar: పాన్‌తో ఆధార్ లింక్.. ఫైన్లతో భారీ ఆదాయం
ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు ముగిసిన తర్వాత కూడా మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31, 2023 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) గడుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాన్ తో ఆధార్ లింక్ చేసేందుకు గత సంవత్సరంతోనే గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా మంది పాన్ తో ఆధార్ లింక్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఫైన్ కట్టడం ద్వారా పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవడానికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు ఈ జరిమాన విధించడం ద్వారా ఇప్పటి వరుకు రూ.601.97 కోట్లు వచ్చాయి.
ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చెప్పాలి అని లోక్ సభలో టీఎంసీ ఎంపీ మాలరాయ్ ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నంకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 29 నాటికి దేశంలో 11.48 కోట్ల పాన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. పాన్ ఆధార్ కార్డు లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు పని చేయదు. మీ పాన్ కార్డు పనిచేయకపోతే మీరు ఎలాంటీ ఆర్థిక లావాదేవీలు జరపలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేరు. ఇప్పుడైనా పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్న శాఖ కోరుతోంది.
ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు ముగిసిన తర్వాత కూడా మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ, ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. పేర్కొన్న అథారిటీకి ఆధార్‌ను బహిర్గతం చేసి రూ. 1,000 అపరాధ రుసుము చెల్లించిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు. అందువల్ల, ఎవరైనా జూలై 3న అభ్యర్థనను పెడితే.. రుసుము చెల్లించిన తర్వాత ఆగస్టు 2 నాటికి PAN మళ్లీ పనిచేస్తుంది. అంతేకాదు.. రెండు డాక్యుమెంట్లను లింక్ చేసినందుకు వినియోగదారులు పెనాల్టీ చెల్లించిన సందర్భాల్లో పాన్ పనిచేయకపోతే ఆయా అభ్యర్థనలను పరిశీలిస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.