»Peddapalli Mp Venkatesh Leader Likely To Join Congress
Breaking: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్ తగిలింది. నేడు ఆయన తెలంగాణ భవన్ లోకి అడుగుపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్తుండడం ఇదే తొలిసారి. అయితే ఈ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు తెలియడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరుపున చెన్నూరు నుంచి పోటీ చేసి బాల్కసుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.
బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తనను కొంతకాలంగా దూరం పెట్టడంతోనే తాను పార్టీ మారినట్లుగా ఆయన కార్యకర్తలతో చెప్పినట్లు తెలుస్తోంది. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తుండేవారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.