»Reliance And Disney Plus Hotstar Merger Deal In Final Stage
Reliance And Disney ఫస్ల్ హాట్ స్టార్ విలీనం..?
రిలయన్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు సంస్థల విలీనం జరగనుంది. ఇందుకు సంబంధించి రెండు కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. వచ్చే నెల చివరి నాటికి విలీన అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Reliance And Disney Plus Hotstar Merger Deal In Final Stage
Reliance And Disney Plus Hotstar: ఎంటర్టైన్ మెంట్, మీడియా రంగంలో మరో విలీనం జరగనుంది. వాల్ట్ డిస్నీకి చెందిన డిస్నీ ఇండియాతో రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రెండు సంస్థల విలీనం తర్వాత ముకేశ్ అంబానీ నేతృత్వంలో గల రిలయన్స్ యాజమాన్యం నియంత్రణ వాటా 51 శాతంతో పెద్ద షేర్ హోల్డర్‌గా నిలువనుంది. డిస్నీకి 49 శాతం ఉండనుంది.
రిలయన్స్‌కు (Reliance) చెందిన వయాకామ్ 18కి అనుబంధ సంస్థగా విలీన సంస్థ ఏర్పాటు చేస్తారని తెలిసింది. యాజమాన్య వాటా కోసం రిలయన్స్ నగదు రూపంలో చెల్లించనుంది. ఆ మొత్తం వివరాలు తెలియరాలేదు. విలీన సంస్థ బోర్డులో రిలయన్స్, డిస్నీకి సమాన ప్రాతినిధ్యం ఉండనుంది. రెండు సంస్థల నుంచి ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు. వయాకామ్‌లో పెద్ద వాటాదారు అయిన బోధి ట్రీకి బోర్డులో చోటు ఇచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి విలీనం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. స్టార్ ఇండియాకు 77 చానెళ్లు ఉండగా.. వయాకామ్‌కు 38 చానెళ్లు ఉన్నాయి. డిస్నీకి డీస్నీ ప్లస్ హాట్ స్టార్, రిలయన్స్‌కు జియో సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ పామ్ ఉన్నాయి. విలీన అంశానికి సంబంధించి రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. ఎకనామిక్ టైమ్స్ కథనం బట్టి.. విలీన ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది.