»Mukesh Ambani Acquires Major Stake In Disney For 1 5 Billion
Mukesh Ambani: అంబానీ చేతిలోకి డిస్నీ..?
జియో నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు OTT దిగ్గజం డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన OTT నెట్‌వర్క్‌ను విస్తరించాలని చూస్తున్నారు.
Mukesh Ambani: జియో నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు OTT దిగ్గజం డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన OTT నెట్‌వర్క్‌ను విస్తరించాలని చూస్తున్నారు. చాలా కాలంగా చర్చ జరుగుతుండగా, ఇప్పుడు డీల్ ఖరారైందని అంటున్నారు. రిలయన్స్ 61% వాటాలను కొనుగోలు చేసింది, మిగిలిన 39% వాటాను డిస్నీ కలిగి ఉంటుంది. రిలయన్స్ 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది.
ఇది భారతీయ రూపాయలలో దాదాపు 12,400 కోట్లకు సమానం. ఈ ఒప్పందం ఇరువురు వాటాదారులకు లాభం కలిగేలా డీల్ కుదుర్చుకున్నారట. రిలయన్స్ గ్రూప్‌తో పాటు డిస్నీ రెండూ ఈ డీల్‌తో భారీగా లాభపడనున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిస్నీ , రిలయన్స్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి.
నిజంగా ఈ డీల్ ఒకే అయితే… భారతీయ స్ట్రీమింగ్ , మీడియా చరిత్రలో అతిపెద్ద డీల్ గా మిగలనుంది. ఇది 100 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు , రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది. జియో సినిమా , డిస్నీ హాట్సర్, భారీ కంటెంట్ , ఒరిజినల్ ప్రొడక్షన్స్ లైబ్రరీతో డిజిటల్ స్ట్రీమింగ్ స్పేస్‌లో రెండు దేశీయ దిగ్గజాలు. నెట్వర్క్ 18 గ్రూప్ కింద కొనుగోళ్ల తర్వాత, అంబానీ OTT రంగంపై కూడా దృష్టి సారించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి భారీ ఒప్పందాలపై దృష్టి సారించారు. ఇక త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా అంబానీ చేతిలోకి రానుంది.