»Famous Tamil Actor Prabhu Fell Illness To Kidney Treatment
Prabhu: అస్వస్థతకు గురైన ప్రముఖ తమిళ నటుడు ప్రభు
తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ తమిళ నటుడు ప్రభు(Prabhu) అస్వస్థతకు గురయ్యారు. ఫిబ్రవరి 20న తనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో చెన్నై(chennai)లోని ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో పరీక్షలు చేయగా, అతనికి కిడ్నీలో రాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ప్రభుకు శస్త్రచికిత్స(surgery) నిర్వహించి కిడ్నిలో రాళ్లు తొలగించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.
Actor #Prabhu was admitted to hospital on 20th night with a severe stomach pain ; "stones were detected , went in for a laser endoscopy surgery… all went well , should be out in a day or two … with all your love 👍💪💐"
ప్రభు లెజెండరీ యాక్టర్ నడిగర్ తిలగం శివాజీ గణేశన్ కుమారుడు. ఇప్పటికే దాదాపు 300 చిత్రాల్లో నటించారు. తమిళం(tamil)తో పాటు తెలుగు(telugu), మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఆయన నటించారు. ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన విజయ్ మూవీ వరిసులో ప్రభు చివరిసారిగా నటించాడు.