ATP: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇల్లూరి నాగేంద్ర అలియాస్ ఉపేంద్ర తాడిపత్రిలో పలుచోట్ల సంచరిస్తున్నాడని, అతడిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి కడప జిల్లాలో మూడు చోట్ల పలువురి పై దాడి చేసి డబ్బు, బంగారు నగలు, సెల్ ఫోన్లు లాక్కేళ్తున్నట్లు తెలిపారు.
SKLM: శ్రీకాకుళం నుంచి ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని ప్రకటించింది. ఈ బస్సు ద్వారా జగన్నాథ స్వామి, సూర్య దేవాలయం, లింగరాజ్ ఆలయం, కుంభమేళా వంటి వాటిని సందర్శించవచ్చు.
ATP: బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటరమణుడి మూల విరాట్‌ను భక్తులు పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి భక్తులతో కలిసి పల్లకీని మోశారు.
ATP: గుత్తి 220కేవి విద్యుత్ సబ్ స్టేషన్‌లో రిలే ప్యానల్స్ మారుస్తున్న నేపథ్యంలో గుత్తి ఆర్.ఎస్ ఫీడర్లో నేటి నుంచి ఈ నెల 8వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశముందని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. టెక్నికల్ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని అధికారులు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన సీనియర్ నాయకుడు కురుబ మల్లన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు సముచితస్థానం కల్పించి, రాజకీయంగా ఎంతో ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.
KMM: జిల్లాలోని వైరా, బోనకల్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గత నెల 31వ తేదీతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే, వైరా, సిరిపురం, ఉప్పలమడక, బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.
SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు బుధవారం రాత్రి తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెంలోని సురేశ్ నివాసంలో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా డైమండ్ బాబు నందిగం సురేశ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులు కలిసి పలు విషయాలపై చర్చించారు. కాగా ఇటీవలే నందిగం సురేశ్ జైలు నుంచి విడుదలయ్యారు.
E.G: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ క్రికెట్, వాలీబాల్ కిట్లు, క్రీడా ప్రాంగణానికి మూడు డే లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామ యువకులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
BDK: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులకే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఎ కృష్ణాగౌడ్ తెలిపారు.
ATP: గుంతకల్లు మీదుగా కుంభమేళాకు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న తిరుపతి-దానాపూర్-తిరుపతి ప్రత్యేక రైలు(నెం 07117) రాత్రి 11:45 తిరుపతిలొ బయలుదేరి గుత్తి, గుంతకల్లు మీదుగా దానాపూర్ చేరనుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం 07118) ఈ నెల 17న దానాపూర్-తిరుపతి నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ATP: గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన రంగనాథ స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ హుండీ లెక్కింపు ఉంటుందని ఈవో రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులు వేసిన కానుకలకు దేవదయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వహకులు, అర్చకులు హాజరు కావాలన్నారు.
TG: రెనోవా సెంచరీ ఆస్పత్రి ఉచితంగా 100 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఆస్పత్రిలో కొత్తగా ఆర్థోపెడిక్స్ విభాగం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తన తల్లి, అత్తకు అదే ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని అన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని అన్నారు.