• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీకి సీనియర్ నాయకుడి రాజీనామా

ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన సీనియర్ నాయకుడు కురుబ మల్లన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు సముచితస్థానం కల్పించి, రాజకీయంగా ఎంతో ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

February 6, 2025 / 09:48 AM IST

‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 6, 2025 / 09:10 AM IST

బోనస్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతులు

ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.

February 6, 2025 / 08:56 AM IST

మరికొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి

KMM: జిల్లాలోని వైరా, బోనకల్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గత నెల 31వ తేదీతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే, వైరా, సిరిపురం, ఉప్పలమడక, బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.

February 6, 2025 / 08:41 AM IST

దత్తాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

February 6, 2025 / 08:25 AM IST

నందిగం సురేశను పరామర్శించిన డైమండ్ బాబు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు బుధవారం రాత్రి తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెంలోని సురేశ్ నివాసంలో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా డైమండ్ బాబు నందిగం సురేశ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులు కలిసి పలు విషయాలపై చర్చించారు. కాగా ఇటీవలే నందిగం సురేశ్ జైలు నుంచి విడుదలయ్యారు.

February 6, 2025 / 08:20 AM IST

సూరారం గ్రామంలో యువకులకు క్రీడా సామగ్రి పంపిణీ

E.G: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ క్రికెట్, వాలీబాల్ కిట్లు, క్రీడా ప్రాంగణానికి మూడు డే లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామ యువకులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

February 6, 2025 / 08:06 AM IST

భద్రాద్రి జిల్లాలో ‘టైగర్ భద్ర’ సంచారం

BDK: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులకే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఎ కృష్ణాగౌడ్ తెలిపారు.

February 6, 2025 / 08:04 AM IST

గుంతకల్లు మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ATP: గుంతకల్లు మీదుగా కుంభమేళాకు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న తిరుపతి-దానాపూర్-తిరుపతి ప్రత్యేక రైలు(నెం 07117) రాత్రి 11:45 తిరుపతిలొ బయలుదేరి గుత్తి, గుంతకల్లు మీదుగా దానాపూర్ చేరనుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం 07118) ఈ నెల 17న దానాపూర్-తిరుపతి నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

February 6, 2025 / 07:49 AM IST

నేడు రంగనాథ స్వామి ఆలయ హుండీ లెక్కింపు

ATP: గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన రంగనాథ స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ హుండీ లెక్కింపు ఉంటుందని ఈవో రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులు వేసిన కానుకలకు దేవదయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వహకులు, అర్చకులు హాజరు కావాలన్నారు.

February 6, 2025 / 05:46 AM IST

‘ఆర్థోపెడిక్స్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు’

TG: రెనోవా సెంచరీ ఆస్పత్రి ఉచితంగా 100 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఆస్పత్రిలో కొత్తగా ఆర్థోపెడిక్స్ విభాగం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తన తల్లి, అత్తకు అదే ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని అన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని అన్నారు.

February 6, 2025 / 05:27 AM IST

రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి: రవిశంకర్

కడప: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ. 9,417 కోట్లు కేటాయించడం జరిగిందని ఆ శాఖ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం పట్ల జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా దాసరి రవిశంకర్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్ల అభివృద్ధి, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

February 5, 2025 / 08:14 PM IST

‘ఐరన్ పైపులను ఏర్పాటు చేయాలి’

కడప: సిమెంటు పైపుల స్థానంలో ఐరన్ పైపులను ఏర్పాటుచేసి సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు అందించాలని ఒంటిమిట్ట బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్.భాను ప్రకాశ్ రాజు అన్నారు. బుధవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా పద్మావతి విశ్రాంతి గృహంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ను కలిశామన్నారు. నేతలు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు శివరాజు, తదితరులు పాల్గొన్నారు.

February 5, 2025 / 07:43 PM IST

ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగలు అరెస్ట్

NLR: మర్రిపాడు మండలంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు బుధవారం ఆత్మకూరు సీఐ గంగాధరరావు, ఎస్సై కే.శ్రీనివాసరావు తెలిపారు. వారు వివరాలను వెల్లడించారు. దొంగల వద్ద నుంచి రూ. 8 వేలు చోరీ సొత్తు, చోరీకి ఉపయోగించిన ఫ్యాషన్ ప్రోమోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు.

February 5, 2025 / 07:38 PM IST

కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్​ అలీ

KMR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అవకతవకలపై సీఐడీ విచారణ చేయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సమగ్ర కుటుంబ సర్వే లేదా ఐహెచ్ఎస్ 2014 పేరుతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కుటుంబాలకు సంబంధించి తెలిపారు.

February 5, 2025 / 07:33 PM IST