• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం’

KRNL: ఈనెల 28న వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS నాయకులు పిలుపునిచ్చారు. ఆదోనిలో జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరుగుతుందని శనివారం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని పేర్కొన్నారు.

March 21, 2026 / 05:22 PM IST

కార్యకర్తను పరామర్శించిన యువజన ప్రధాన కార్యదర్శి

MLG: వెంకటాపూర్(M)రామానుజాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందోట నరేష్ ఇటీవల పాముకాటుకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య ఇవాళ బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

March 21, 2026 / 05:22 PM IST

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత

SS: పెనుకొండ(మం) శెట్టిపల్లిలోని శ్రీరామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీ సత్యసాయి జిల్లా దూదేకుల నూర్భాషా సంఘం అధ్యక్షులు, మాజీ కన్వీనర్ సిద్దయ్య రూ.10,000 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా ఈ మొత్తాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.

March 21, 2026 / 05:21 PM IST

జిన్నేపల్లెలో అగ్నిప్రమాదం.. రైతుకు తీవ్రర నష్టం

NDL: సిరివెళ్ల మండలం జిన్నేపల్లె గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు తీగలు తగలడంతో ఓ రైతుకు చెందిన ట్రాక్టర్‌పై ఉన్న జొన్న సొప్ప మంటల్లో దగ్ధమైంది. మూగజీవులకు ఆహారంగా ఉపయోగపడాల్సిన సొప్ప కాలిపోవడంతో రైతు తీవ్రంగా విలపించాడు. ఈ ఘటనతో రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 21, 2026 / 05:21 PM IST

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక డంపులు

MHBD: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు ఇసుకను డంపు చేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నర్సింహులపేట మండలంలోని లోక్యా తండా జీపీ పరిధిలోని మొక్కజొన్న చేనులో సుమారు 30 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. ఈ ఇసుక దందా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

March 21, 2026 / 05:20 PM IST

నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం: డీవైఎఫ్ఐ

MBNR: రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంపై భగత్ సింగ్ చౌరస్తాలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

March 21, 2026 / 05:20 PM IST

పెద్ద మట్టి బెడ్డ పడి కార్మికుడి కాలుకు తీవ్రగాయం

MNCL: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్‌లో కూలి పని చేస్తుండగా పెద్ద మట్టి బెడ్డ పడి శనివారం కార్మికుడి కాలుకు బలమైన గాయమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాళ్లపేటకు చెందిన బండి తిరుపతి ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే 108కు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి, క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 21, 2026 / 05:19 PM IST

KKRకు మరో బిగ్ షాక్

ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా సేవలను కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. నడుము నొప్పితో ఆకాశ్ దీప్ కూడా IPL 2026కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి కనీసం 8 వారాల సమయం పడుతుందని ఓ BCCI అధికారి తెలిపారు. మరో స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ పెట్టే ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే IPL ఆడగలడు.

March 21, 2026 / 05:19 PM IST

‘ముస్లింలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంది’

KMM: సత్తుపల్లి పట్టణం ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఈద్గాలో మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు అన్ని విధాల తోడుగా ఉంటుందని ఆయన తెలిపారు. ముస్లిం ప్రజానీకం ప్రజా ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వాలని కోరారు.

March 21, 2026 / 05:18 PM IST

పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి: కలెక్టర్

JN: సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాలోని 12 మండలాల నుండి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో రైతులు ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 05:17 PM IST

రంజాన్ పండుగ స్ఫూర్తిదాయకమైంది: మాజీ మంత్రి

ADB: రంజాన్ పండుగ స్ఫూర్తిదాయకమైందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి అలైబలై కార్యక్రమంలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను శాంతి సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమని జోగు రామన్న పేర్కొన్నారు.

March 21, 2026 / 05:16 PM IST

మార్కాపురం జిల్లాలో MRO సస్పెండ్

ప్రకాశం: పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు వీఆర్వో విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని 25కి పైగా మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 21, 2026 / 05:15 PM IST

పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పర్యటించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించే పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం లోని ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు.

March 21, 2026 / 05:15 PM IST

‘మైనారిటీ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం’

KKD: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కాకినాడలోని ఈద్గా మైదానం నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో కొండబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ సుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 05:14 PM IST

‘పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శనివారం సబ్బవరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు.

March 21, 2026 / 05:14 PM IST