MNCL: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్లో కూలి పని చేస్తుండగా పెద్ద మట్టి బెడ్డ పడి శనివారం కార్మికుడి కాలుకు బలమైన గాయమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాళ్లపేటకు చెందిన బండి తిరుపతి ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే 108కు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి, క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.