• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పత్రికా రిపోర్టర్‌ని పరామర్శించిన ఎమ్మెల్సీ’

NTR: నందిగామలోని ఓ పత్రికా విలేఖరి వెలది సుగుణశేఖర్ రావుని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గురువారం పరామర్శించారు. గుండెపోటు కారణంగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.

February 6, 2025 / 01:04 PM IST

ప్రజలకు అవగాహన కల్పించిన విద్యార్థులు

కృష్ణా: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విద్యార్థులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహాయపడాలని అనే అంశాలను ప్రదర్శన రూపంలో ప్రజలకు తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనకు ప్రజలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

February 6, 2025 / 12:37 PM IST

విక్కీ నెలన్నర బ్రేక్ తీసుకున్నారు: దర్శకుడు

నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా ‘ఛావా’. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలోని కీలక సీన్ షూటింగ్ సమయంలో విక్కీ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దాదాపు నెలన్నర బ్రేక్ తీసుకున్నారని వెల్లడించారు.

February 6, 2025 / 11:30 AM IST

40వేల ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా..!

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల కోత విషయంలో ట్రంప్ నిర్ణయం ఫలిస్తోంది. స్వచ్ఛంద రాజీనామాకు 40 వేల మందికిపైగా ఉద్యోగులు ఆమోదం తెలిపారని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ గడువు ఇవాళ్టి వరకు మాత్రమే ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

February 6, 2025 / 11:23 AM IST

బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ: YS జగన్

AP: కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. అమలు చేయకపోతే చొక్కాలు పట్టుకుని నిలదీయండని అన్నారు. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీగా మారింది. బటన్ నొక్కటం గొప్పనా అని మాపై విమర్శలు చేశారు. ఈ 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి’ అని అన్నారు.

February 6, 2025 / 11:21 AM IST

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి: సీఐ

ATP: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇల్లూరి నాగేంద్ర అలియాస్ ఉపేంద్ర తాడిపత్రిలో పలుచోట్ల సంచరిస్తున్నాడని, అతడిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి కడప జిల్లాలో మూడు చోట్ల పలువురి పై దాడి చేసి డబ్బు, బంగారు నగలు, సెల్ ఫోన్లు లాక్కేళ్తున్నట్లు తెలిపారు.

February 6, 2025 / 11:10 AM IST

శ్రీకాకుళం నుంచి పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్ సర్వీస్

SKLM: శ్రీకాకుళం నుంచి ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని ప్రకటించింది. ఈ బస్సు ద్వారా జగన్నాథ స్వామి, సూర్య దేవాలయం, లింగరాజ్ ఆలయం, కుంభమేళా వంటి వాటిని సందర్శించవచ్చు.

February 6, 2025 / 10:57 AM IST

పల్లకీ మోసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటరమణుడి మూల విరాట్‌ను భక్తులు పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి భక్తులతో కలిసి పల్లకీని మోశారు.

February 6, 2025 / 10:10 AM IST

ఈ నెల 8వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: గుత్తి 220కేవి విద్యుత్ సబ్ స్టేషన్‌లో రిలే ప్యానల్స్ మారుస్తున్న నేపథ్యంలో గుత్తి ఆర్.ఎస్ ఫీడర్లో నేటి నుంచి ఈ నెల 8వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశముందని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. టెక్నికల్ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని అధికారులు తెలిపారు.

February 6, 2025 / 09:57 AM IST

వైసీపీకి సీనియర్ నాయకుడి రాజీనామా

ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన సీనియర్ నాయకుడు కురుబ మల్లన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు సముచితస్థానం కల్పించి, రాజకీయంగా ఎంతో ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

February 6, 2025 / 09:48 AM IST

‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 6, 2025 / 09:10 AM IST

బోనస్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతులు

ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.

February 6, 2025 / 08:56 AM IST

మరికొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి

KMM: జిల్లాలోని వైరా, బోనకల్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గత నెల 31వ తేదీతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే, వైరా, సిరిపురం, ఉప్పలమడక, బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.

February 6, 2025 / 08:41 AM IST

దత్తాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

February 6, 2025 / 08:25 AM IST

నందిగం సురేశను పరామర్శించిన డైమండ్ బాబు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు బుధవారం రాత్రి తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెంలోని సురేశ్ నివాసంలో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా డైమండ్ బాబు నందిగం సురేశ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులు కలిసి పలు విషయాలపై చర్చించారు. కాగా ఇటీవలే నందిగం సురేశ్ జైలు నుంచి విడుదలయ్యారు.

February 6, 2025 / 08:20 AM IST