NDL: బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్ 340B హైవే రహదారికి తూర్పున ఉన్న పొలాలకు రస్తా కోసం రైతులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలాలకు వెళ్లే రాస్తాను గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే కోట్లకు వినతిపత్రం అందజేశారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించారు. రేగడికొత్తూరుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరయ్యను ఆమె పరామర్శించారు. అనంతరం ఆకులేడు గ్రామంలో నాగరాజు భౌతికకాయానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
NLR: బుచ్చి మండలంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్, వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడేనికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌ని హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిపారు.
NLR: ముత్తుకూరు మండలం వల్లూరులోని పశువైద్యశాలతోపాటు సిమెంట్ రోడ్లను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీయాలన్నారు.
MHBD: కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కాలాన్ని భవిష్యత్తుని ఫణంగా పెట్టి కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈనెల 7న విడుదల కాబోయే, నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేస్తున్నాడు.
WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ రాంపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసేలా చేపట్టే ఉద్యమానికి సహకరించాలని కోరుతూ మడికొండ సీఐ పీ.కిషన్‌కు పలు గ్రామాల ప్రజలు వినతి పత్రం అందజేశారు. రాంపురం, మడికొండ గ్రామాల ప్రజలు నేడు సీఐని కలిసి సమస్య తీవ్రతను వివరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
W.G: రాష్ట్రంలోని పట్టభద్రులంతా జనసేన వైపు చూస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థి రాజశేఖరంను గెలిపించుకోవాలన్నారు.
తన భార్య శోభితా ధూళిపాళ్ల గురించి నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శోభిత నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ మూవీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ‘మేజర్’లో శోభిత యాక్టింగ్ బాగుంటుందని తెలిపారు. ఆమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని, భాష విషయంలో తనకు సాయం చేస్తుందన్నారు. ఏదైనా ప్రోగ్రాంలో తాను స్పీచ్ ఇవ్వాల్సి వస్తే శోభితనే హెల్ప్ చేస్తుందని చెప్పారు.
గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించి ఆ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తోన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్‌నకు మద్దతు పలికారు. ఆయన ఉద్దేశంలో తప్పులేదని చెప్పారు. ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోవాలా? లేదా? అనేది పాలస్తీనియన్ల ఇష్టమని, ఏదేమైనా గాజాను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా అదిలాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరేట్లో గురువారం సమర్పించారు. తాను 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రెబల్‌గా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
GNTR: ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని అంగన్వాడీ టీచర్లను కోరారు.
PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన జాపతి రాజయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నేత్రదానం చేశారు. లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోహైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు దేవక్క, శ్రీనివాస్, శేఖర్, రమ, పాల్గొన్నారు.
SRCL: కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో గల కళాశాల మైదానం బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియం వాకర్స్‌తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.