GNTR: గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలుపుకు కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి విడదల రజిని హాజరుకావాలని గురువారం ఆర్యవైశ్యులు ఆమె నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈనెల 8వ తారీఖున జరుగుతుందని తెలిపారు.
ELR: ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో గురువారం సంచార హెచ్ఐవి సలహా మరియు పరీక్ష కేంద్రము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, గర్బిణి స్త్రీలకు, ట్రాన్స్ జెండర్లకు మరియు యువతకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించచారు. జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. హెచ్ఐవి సలహా పరీక్ష కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు.
NLR: కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్ర(KVC)లో గురువారం SCసబ్ ప్లాన్ క్రింద మహిళా రైతులకు కూరగాయల విత్తనాలను, గొర్రెల దాణాను ఉచితంగా పంపిణీ చేశారు. రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ గురువారం కందుకూరు KVCని పరిశీలించిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ELR: జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహిళా అభయ రక్షక దళం ప్రత్యేక గస్తీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం మహిళా పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రముఖ బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల సమీపం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో నిరంతరం గస్తీలు నిర్వహిస్తున్నారు.
NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కౌమారదశలో ఎదురయ్యే మార్పులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జీవీ రమేశ్ బాబు, డీపీఎమ్ ఎం.మోహన్ రావు, వైద్య సిబ్బంది జి. విమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
MDK: తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌లను మంత్రి దామోదర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. వ్యాధుల, చికిత్సల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆఫీసర్ల పాత్ర కీలకమైందన్నారు.
ప్రకాశం: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్ ఏర్పాటు చేయాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లోని అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల ఫిర్యాదులను విని వాటికి పరిష్కార మార్గం చూపాలని ఆయన ఆదేశించారు.
HYD: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరా నగర్‌కు చెందిన షాబాజ్ (23) అనే వ్యక్తిపై దుండగులు కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.
NLR: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా నిరంతరం దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు.
ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్-7, సవిత-11, పయ్యావుల కేశవ్-24వ ర్యాంకులు సాధించారు.
ATP: గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ శాఖా కార్యాలయాలతో కలిసి గుంతకల్-నల్వార్ స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ సురక్షితతను గురువారం సమీక్షించారు. ట్రాక్, సిగ్నల్ సిస్టమ్, సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిచూసేందుకు రియర్ విండో పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖా అధికారులు, టెక్నికల్ టీమ్‌లు పాల్గొన్నారు.
JGL: తెలంగాణ ప్రభుత్వం అమృత్ 2.0 కింద మెట్‌పల్లిలో గురువారం నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని అదేశించారు. ఈ మేరకు మున్సిపల్ ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సర్వేను ప్రారంభించారు. పట్టణములో 50 సర్వే పాయింట్లు గుర్తించామని, ఈ సర్వేకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.
ATP: అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ గురువారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సృజనాత్మక రీల్స్, పోస్ట్లు, వీడియోలు తయారు చేయాలని కోరారు. యువతకు చేరేలా సామాజిక బాధ్యతగా ఈ విషయాలపై కంటెంట్ సృష్టించాలని ఎస్పీ జగదీష్ తెలిపారు.
E.G: ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో పూజలు జరిపించి కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజీవ్ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు.