KMM: సత్తుపల్లి పట్టణం ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఈద్గాలో మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు అన్ని విధాల తోడుగా ఉంటుందని ఆయన తెలిపారు. ముస్లిం ప్రజానీకం ప్రజా ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వాలని కోరారు.
JN: సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాలోని 12 మండలాల నుండి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో రైతులు ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ADB: రంజాన్ పండుగ స్ఫూర్తిదాయకమైందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి అలైబలై కార్యక్రమంలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను శాంతి సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమని జోగు రామన్న పేర్కొన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు వీఆర్వో విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని 25కి పైగా మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పర్యటించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించే పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం లోని ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు.
KKD: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కాకినాడలోని ఈద్గా మైదానం నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో కొండబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ సుభాకాంక్షలు తెలిపారు.
AKP: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శనివారం సబ్బవరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు.
IPL టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఇచ్చిన మాదిరే.. ఫీల్డింగ్, బౌండరీలతో ఆటపై ఇంపాక్ట్ చూపించే ప్లేయర్లకు MVP అవార్డ్ అందిస్తారు. గత 18 సీజన్లుగా ఆడుతున్న ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీస్ పాండేలలో.. కోహ్లీ మాత్రమే 2016లో ఈ అవార్డ్ అందుకున్నాడు. ఇక సునీల్ నరైన్ అత్యధికంగా 3 సార్లు(2012, 18, 24) దీన్ని అందుకోగా.. వాట్సన్, రసెల్ తలో 2 సార్లు తీసుకున్నారు.
KRNL: తుగ్గలిలోని ఇండియన్ విష్ణు ప్రియ ఏజెన్సీని ఇవాళ తుగ్గలి తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను, గోడౌన్ తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. మండలంలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు బుకింగ్ అయినా తర్వాతే రావాలని అన్నారు. గృహ వినియోగదారులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
ATP: జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలిపిన ఉగాది పురస్కార గ్రహీతలను MLA దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు ఎర్రిస్వామి, జర్నలిస్టు రవిచంద్ర, పౌరాణిక నటుడు తిరుపాల్ నాయక్లను సత్కరించారు. ఐటీ ఉద్యోగం వదిలి సాగులో రాణించిన ఎర్రిస్వామి నిజాయతీకి నిదర్శనమైన రవిచంద్ర, కళాకారుడు తిరుపాల్ నాయక్ సేవలను కొనియాడారు.
WGL: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పట్టణంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్, WGL జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, HNK జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిలుగా MLAలు నాయిని, KR నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని, విందును స్వీకరించారు.
PPM: ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరంలోని బొత్స నివాసానికి వెళ్లిన ఆయన, మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
BHPL: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాల్ బహాదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన “డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ ఛాంపియన్స్ ప్రోగ్రామ్”ను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ ద్వారా జిల్లా పరిపాలనను మరింత సమర్థవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
NDL: మహానంది మండలం తమ్మడపల్లెలో జూన్ 2, 3వ తేదీల్లో పెద్దమ్మ జాతర మహోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాల గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఈనెల 24న మొదటి ముడుపు కట్టేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. జూన్ 18వ తేదీ వరకు 16 రోజుల పండుగ ఉంటుందని, అంతవరకు ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని చెప్పారు.
SKLM: హైదరాబాద్‌లో కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు పెద్ద కర్మ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.