అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల కోత విషయంలో ట్రంప్ నిర్ణయం ఫలిస్తోంది. స్వచ్ఛంద రాజీనామాకు 40 వేల మందికిపైగా ఉద్యోగులు ఆమోదం తెలిపారని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ గడువు ఇవాళ్టి వరకు మాత్రమే ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.