VZM: కరాటేలో నెల్లిమర్ల శ్రీ ఆదిత్య విద్యాలయం విద్యార్థులు ప్రతిభకనబరిచారు. విజయనగరం రాజీవ్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ కరాటే పోటీలలో శ్రీ ఆదిత్య విద్యాలయం విద్యార్థులు పతకాలపంట పండించారు. పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు గోల్డ్ మెడల్ సాధించగా ఎడుగురు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.