ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం శీలంవారిపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి గరుడ, విమాన కలశ, రాజ గోపుర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.