ప్రకాశం: పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ వీర మహిళలు, జన సైనికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కొండపి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంఛార్జి కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సింగరాయకొండ పార్టీ ఆఫీసులో చలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.