SKLM: పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న 12వ జనసేన పార్టీ ఆవిర్భావ మహోత్సవం విజయవంతం చేయాలని సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీ మోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం సరుబుజ్జిలిలోని ఆ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆవిర్భావ పోస్టర్ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆవిర్భావ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.