TG: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. మహిళా సంఘాలకు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని రేవంత్ తెలిపారని.. అయితే ఆ రుణాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. గత 11నెలల కాలంలో ఒక్క పైసా వడ్డీ లేని రుణం కూడా విడుదల చేయలేదన్నారు.