కోనసీమ: ఈనెల 12న కోనసీమ జిల్లా కేంద్రంగా YCP ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MLC తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం యువత పోరు పోస్టర్లను మండపేట YCP కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విడుదల చేశారు. పేద విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతుందన్నారు.