కోనసీమ: ఆస్తి పన్ను వసూళ్లులో మండపేట పురపాలక సంఘం కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో పదవ స్థానం సాధించిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి తెలిపారు. పన్ను వసూళ్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు చేసిన కృషిని అభినందించారు. గురువారం ఆమె ఛాంబర్లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వాలు నడవాలంటే పన్నులు వసూలు కీలకమన్నారు.