HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట నేడు వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ప్రారంభించారు. అకాల వర్షాలు అనావృష్టి సమస్యల నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిర్రా నర్సింగ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చాంద్ పాషా పాల్గొన్నారు.