MHBD: జిల్లా కేంద్రంలోని లెనిన్ నగరికి చెందిన అమరావతి (40) అనే మహిళ సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి కూతురు ఉండటంతో కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగారు. నిరుపేదలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె భర్త కోరాడు.