KDP: కడప జిల్లా చెన్నూరు మండలం నెలటూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 151వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి మంగళవారం శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. శాలువాతో శ్రీకాంత్ రెడ్డిని సత్కరించి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు.