BPT: బాపట్ల మండలం స్టువర్టుపురంలో నాటు సారాయి తయారీ చేస్తూ నలుగురు యువకులు పోలీసులకు చిక్కారు. గుప్త సమాచారం ఆధారంగా వెదుళ్లపల్లి ఎస్సై భాగ్యరాజ్ సారథ్యంలో జరిపిన దాడిలో శశిధర్ అలియాస్ జిమ్మీ, అనూష్ అలియాస్ తిలక్, సాయి చందు, నరసింహారావు అలియాస్ చింటూ అరెస్టయ్యారు. కుందేరు వాగు ఒడ్డున తయారుచేసిన మద్యాన్ని అమ్మేందుకు సిద్ధంగా ఉండగా పట్టుబడ్డారు.