NDL: కూటమి ప్రభుత్వంలో చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంగళవారం బనవాసిలో టెక్స్టైల్ పార్క్ భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా భూమిపూజ నిర్వహించిన సందర్భంగా బనవాసిలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు.