ప్రకాశం: ఎర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో అలసత్వం వద్దని తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ఈ సమావేశంలో పుల్లల చెరువు, దోర్నాల, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు ఎస్ఐలు పాల్గొన్నారు.