MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపురం గ్రామ శివారులో 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన ఎరుకలి నాంచారమ్మ ఆలయంలో ఈ నెల 12న జాతర నిర్వహించనున్నట్లు ఎరుకల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ భాస్కర్ తెలిపారు. ఎరుకల కులస్థుల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు.