KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారిని ఆరాధన మహోత్సవాల సందర్భంగా PCC అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి మంగళవారం బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.