అన్నమయ్య: వాల్మీకిపురం పట్టణంలో శుక్రవారం మాజీ సైనికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వాయల్పాడు, మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రవి, కంచర్ల శ్రీ నాయుడు మాట్లాడుతూ.. మాజీ సైనికుడి కుమారుడు వెంకటాద్రిపై వేధింపులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.