NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంపన్నులతో సమానంగా భోజనం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు.