ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు స్థానిక టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.