BPT: వేసవి సెలవుల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరుగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ తుషార్ గురువారం సూచించారు. విహార యాత్రలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. పోలీసులకు సమాచారం అందిస్తే నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.