• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎస్ దృష్టికి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు

కడప: రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలసపాడుకు చెందిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బ్రహ్మానందరెడ్డి కోరారు. విజయవాడలో బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలిసి వినతిపత్రం ఇచ్చామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

February 5, 2025 / 07:12 PM IST

జిల్లా అధ్యక్షున్ని కలిసిన మండల నాయకులు

NZB: ఇటీవల నిజామాబాద్ జిల్లా BJP జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ కులచారిని NZB జిల్లా కార్యాలయంలో బుధవారం ముగ్పాల్ బీజేపీ నాయకులు కలిశారు. అనంతరం ఆయను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్పాల్ మండల నాయకులు మాట్లాడుతూ.. రెండోసారి ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం హర్షనీయమన్నారు.

February 5, 2025 / 07:09 PM IST

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 5, 2025 / 06:49 PM IST

కాలేశ్వరం ఆలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం

PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 5, 2025 / 06:49 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మార్వో

NZB: ముప్కాల్ మండల నూతన ఎమ్మార్వో గజానన్ను మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది, రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 5, 2025 / 06:29 PM IST

సుల్తానాబాద్ మండల తాహసీల్దార్‌గా రామచంద్ర రావు బాధ్యతల స్వీకరణ

PDPL: సుల్తానాబాద్ మండల నూతన తహశీసీల్దార్‌గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

February 5, 2025 / 06:24 PM IST

బీజేపీ మండలాధ్యక్షుల నియామకం

కామారెడ్డి: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను బుధవారం నియమించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. 

February 5, 2025 / 05:58 PM IST

పగడాలకు టైలర్ అసోసియేషన్ అభినందనలు

కృష్ణా: నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన పగడాల సత్యనారాయణను వర్కర్స్ అండ్ టైలర్ అసోసియేషన్ అభినందించింది. పగడాలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి, వృత్తిదారుల పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి సారధ్యంలో అభివృద్ధి చూపుతామని పగడాల హామీ ఇచ్చారు.

February 5, 2025 / 04:01 PM IST

పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించిన ఛైర్మన్

NZB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజ రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఛైర్మన్ హామి ఇచ్చారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బి.సీతయ్యను ఇరువురు అభినందించారు.

February 5, 2025 / 03:47 PM IST

నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NZB: నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ బుధవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ రవీందర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి పద్ధతుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

February 5, 2025 / 03:42 PM IST

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

KMM: తల్లాడ మండల మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్‌కు బయలుదేరగా తల్లాడ మండల పరిధిలో ఉన్న సర్పంచులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం మండల కార్యదర్శి అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసి 13 నెలలు అయినా నేటికి బిల్లులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు.

February 5, 2025 / 02:20 PM IST

తిరుమలలో అన్యమత వ్యాఖ్యలతో కూడిన కారు

AP: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. అన్యమతానికి చెందిన వ్యాఖ్యలతో కూడిన ఓ కారు తిరుమలలో ప్రత్యక్షం కావటం వివాదాస్పదంగా మారింది. అన్యమత వ్యాఖ్యలతో కూడిన వాహనాన్ని కొండ మీదకు ఎలా పంపించారంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

February 5, 2025 / 02:19 PM IST

కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

SRPT:  BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది.

February 5, 2025 / 02:11 PM IST

‘చిన్న పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయాలి’

BDK: ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని పినపాక పీహెచ్సి వైద్యురాలు దుర్గ భవాని అన్నారు. బుధవారం ఆమె పోతిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, టీకా వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం ప్రతినెల వైద్య సిబ్బంది బాలింతలను గుర్తించి టీకా వేసే విధంగా కృషి చేయాలని అన్నారు.

February 5, 2025 / 01:45 PM IST

మూవీ రిలీజ్‌కు ముందే అరుదైన రికార్డు

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘L2 ఎంపురాన్’. ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అరుదైన రికార్డును నెలకొల్పింది. 6 దేశాలు, 25 పట్టణాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

February 5, 2025 / 01:41 PM IST