TG: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రవాణా శాఖ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై లైసెన్స్ పొందాలంటే కొత్తగా ఆన్‌లైన్ పరీక్షను తప్పనిసరి చేయనుంది. ఈ విధానం APR 1 నుంచి అమల్లోకి రానుంది. LLRకు దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు విని పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ నంబర్ పొందాకే LLR స్లాట్ బుక్ చేసుకోవాలి.
NLG: జిల్లాలో పారిశ్రామిక సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం వ్యవసాయానికే పరిమితమైన ఈ ప్రాంతం, ఇప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేరాఫ్‌గా మారుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన తర్వాత పరిశ్రమల రాక పెరుగుతోంది. తాజాగా విడుదలైన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2026’ ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.
KMM: ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 10 రోజులే గడువు ఉండటంతో ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) పన్నుల వసూళ్లను వేగవంతం చేసింది. శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులతో సమీక్ష నిర్వహించి అన్ని విభాగాల సిబ్బందిని వసూళ్ల ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బకాయిలను కూడా యుద్ధప్రాతిపదికన రాబట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి NZB జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మెండోరా, మోస్రా 38.7°C, బాల్కొండ 38.4, మాచర్ల 38.2, భీమగల్ 38, తొండకూరు 37.5, మోర్తాడ్ 37.4, వేంపల్లె 37, మాగిడి, ఎడపల్లి నిజామాబాద్(సౌత్), కొల్లూరు(బాన్సువాడ) 36.7, పెర్కిట్, ఎర్గట్ల 36.6, ఆలూరు, బీబీపేట 36.5°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
AP: చిత్తూరులో అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. సిద్ధార్థనగర్ కాలనీలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లింగ్ ముఠా కంటపడింది. దీంతో ముఠా 2 కార్లలో పొగాకు ఉత్పత్తులతో పరారవగా.. పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితులు నిమిచంద్, సునీల్, శ్రీనివాసులును అరెస్ట్ చేసి, వారి నుంచి 45 బస్తాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడిని సర్పంచ్ చెడుపాక సుజాత యాకన్న, ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారిలతో కలిసి ఎస్సై గంగారపు కర్ణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అంగడిలో అన్ని సరుకులు అందుబాటులో ఉండే విధంగా సంతను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
SKLM: నగరంలోని మండలి వీధిలో నివాసం ఉంటున్న టీడీపీ కార్యకర్త మోహన్ కృష్ణ మరణం టిడిపికి తీరని లోటుఅని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం రాత్రి మోహనకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
భారత రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నెట్‌వర్క్ & సైబర్ సెక్యూరిటీ విభాగంలో 18 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(మంగళవారం)తో ముగియనుంది. ఫీల్డ్ ఆపరేషన ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉండగా.. విద్యార్హతతో పాటు సంబంధిత IT సర్టిఫికేషన్ గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.400+18% GST. SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు.
MNCL: వాహనాలను అధిక వేగంతో నడిపితే వాహన దారులకు వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక FDO రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. అభయారణ్యం వన్యప్రాణులకు నిలయమన్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యంలో వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేయడం జరిగిందన్నారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేశామని FDO తెలిపారు.
చాలామంది ఉదయం బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా చేయకుండా ఒక అరటిపండు, గ్లాస్ పాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు అరటిపండు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
NLR: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి ఒంగోలు నుంచి భీమవరానికి బైక్‌పై వస్తున్న ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు పాలేరు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోహిస్తూ వికలాంగులు బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడారు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు.
AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
GDWL: రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గ్రామ సర్పంచ్ బేబీ ఆధ్వర్యంలో ‘కిస్తీ’ వేడుకలను భక్తిశ్రద్ధతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించి కిస్తీ సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.