SRD: జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 23 నుంచి ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు DMHO డాక్టర్ వసంత రావు తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, సదాశివపేట, పటాన్చెరు, జోగిపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేయనున్నారు. రోగుల ఆరోగ్య వివరాలన్నీ డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయన్నారు.