• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వేల్పూరులో టీడీపీ నాయకుడు మృతి

కృష్ణా: పమిడిముక్కల మండలం వేల్పూరులో టీడీపీ నాయకుడు చీకుర్తి ఏసుబాబు మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గ్రామానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు మృతునికి శ్రద్ధాంజలి ఘటించారు.

March 22, 2026 / 08:15 AM IST

డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ కోసం తారక్ మేకోవర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా పాత్ర కోసం దర్శకుడి కోరిక మేరకు ఎన్టీఆర్ లీన్ లుక్‌లోకి మారిపోయాడు. తన ఫిట్‌నెస్ టీమ్‌తో కలిసి 7 వారాల్లోనే ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడట. రోజుకు 90 నిమిషాల ఫంక్షనల్ ట్రైనింగ్, కఠినమైన డైట్ పాటించి ఈ మార్పు సాధించినట్లు ట్రైనర్లు తెలిపారు.

March 22, 2026 / 08:15 AM IST

చాగదోన గ్రామంలో సీసీ రోడ్డు భూమిపూజ

GDWL: గ్రామ అభివృద్ధికి సిమెంట్ రోడ్లు కీలకమని చాగదోన సర్పంచ్ జె.వీరేశ్ స్వామి అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శనివారం భూమిపూజ చేశారు. మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ పనుల నాణ్యతపై గుత్తేదారులకు సూచనలు చేశారు.

March 22, 2026 / 08:15 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

KMM: ఖమ్మం జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 నుంచి 380 పలుకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 310 నుంచి 320 వరకు పలుకుతుంది. వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధరలు ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.

March 22, 2026 / 08:13 AM IST

‘అయోధ్య, కాశీ వెళ్లే ప్రయాణికులకు GOOD NEWS’

PDPL: GDK బస్ డిపో నుంచి అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలకు ఈనెల 28న ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM నాగభూషణం తెలిపారు. మైసూర్, ప్రయాగరాజు, అయోధ్య, కాశీ, చందా మహంకాళి దర్శనం అనంతరం 6వ రోజు GDK చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని వినియోగించుకోవాలని, వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.

March 22, 2026 / 08:13 AM IST

ఇళ్ల పక్కనే చెరువు కట్ట.. త్వరలో ఫుడ్ స్టాల్స్

MDCL: ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఇళ్ల పక్కనే చెరువు కట్ట ఉండటం గమనార్హం. చెరువు సుందరీకరణ పూర్తయిన తర్వాత ఈ చెరువు కట్ట పై ఫుడ్ స్టాల్స్, స్ట్రీట్ బిజినెస్ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్ నల్ల చెరువుకు ఆనుకుని అనేక భవనాలు ఉన్న నేపథ్యంలో, హైడ్రా వారిని టచ్ చేయలేదు.

March 22, 2026 / 08:13 AM IST

బుగ్గారంలో చెలరేగిన ప్రోటోకాల్ వివాదం

JGL: బుగ్గారం మండల కేంద్రంలో నిన్న ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. రంజాన్ పండుగ సందర్భంగా, రంజాన్ తోఫా పంపిణీలో తహశీల్దార్, ఎంపీడీవో, దళిత మహిళా సర్పంచ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.

March 22, 2026 / 08:12 AM IST

ఘనంగా మత్స్య జయంతి వేడుకలు

TPT: నాగలాపురం మండలంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. నిన్న ఉదయం ప్రత్యేక పూజలు, మహాశాంతి హోమం నిర్వహించి, సాయంత్రం గరుడవాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం చేపట్టారు. మత్స్యకారులు ఇరుముడులతో పాల్గొని భక్తి చాటగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

March 22, 2026 / 08:11 AM IST

భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి: ఆనంద్ మాదిగ

VKB: భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎంఎస్‌పీ (MSP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై అవగాహన కోసం చేపట్టిన 23 రోజుల యాత్ర శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద యాత్రకు ఘన స్వాగతం పలికారు.

March 22, 2026 / 08:11 AM IST

పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి అందజేత

WNP: గోపాల్ పేట మండలం, చిట్యాల గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లను పోలీసులు గుర్తించి తిరిగి అందజేశారు. CEIR పోర్టల్ సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసిన ఎస్ఐ జగన్ మోహన్ శనివారం బాధితులకు వాటిని అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 22, 2026 / 08:11 AM IST

జిల్లాలో మాంసం ధరలు

GNTR: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ చికెన్ ధర రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300 పలుకుతోంది. కేజీ మటన్ ధర రూ. 960 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే.. కొరమేను రూ. 430, బొచ్చెలు రూ. 230లుగా ఉన్నాయి.

March 22, 2026 / 08:10 AM IST

నేటి మాంసం ధరలు వివరాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 నుంచి 360 పలుకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 310 నుంచి 320 వరకు పలుకుతుంది. అలాగే కేజీ మటన్ ధర రూ.700 నుంచి 750 వరకు పలుకగా.. కేజీ మేక మాంసం ధర రూ. 800 నుంచి 850 వరకు మాంసం విక్రయదారులు తెలిపారు. మీ ప్రాంతాల్లో చికెన్ ధరలు కామెంట్ చేయండి.

March 22, 2026 / 08:10 AM IST

ఈనెల 25న జాబ్ మేళా

PPM: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న పార్వతీపురంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య తెలిపారు. గాయత్రి కళాశాలలో జరిగే ఈ మేళాకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు హాజరు కావచ్చన్నారు. పూర్తి వివరాలు కొరకు వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపారు.

March 22, 2026 / 08:10 AM IST

ఈ నెల 31న చీమకుర్తి తిరునాళ్లు

ప్రకాశం: చీమకుర్తిలో ఈ నెల 31వ తేదీన తిరుణాళ్లు నిర్వహించనున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు. సాయంత్రం సమయాల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తిరుణాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

March 22, 2026 / 08:10 AM IST

కాకినాడ పోర్డు గోదాముల్లో జేసీ తనిఖీలు

KKD: పోర్ట్ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీవో, పౌరసరఫరాల అధికారులు, పోలీసులతో కలిసి 29 గోదాములు, చెక్ పోస్టులను పరిశీలించారు. బియ్యం స్టాక్, రవాణా రికార్డులు, రిజిస్టర్లను సవివరంగా పరిశీలించి అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. 

March 22, 2026 / 08:10 AM IST