KMM: ఖమ్మం జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ.350 నుంచి 380 పలుకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 310 నుంచి 320 వరకు పలుకుతుంది. వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధరలు ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.