BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని అన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10:30 గంటలకు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.