కామారెడ్డిలో GCR ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్యస్పందన లభించింది. ఆదివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నియోజకవర్గంలోని 3,500 మంది అభ్యర్థులు హాజరు కాగా 50 కంపెనీలు పలు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 325 మంది ఎంపికైనట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.