MLG: తాడ్వాయి మండలం గోనెపల్లిలో సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఇవాళ గ్రామసభ నిర్వహించి గ్రామంలో ఎవరైనా మద్యం, గుడుంబా తదితర మత్తు పానీయాలు విక్రయిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలపై ఆంక్షలు విధిస్తామని గ్రామస్తులు తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.