WGL: నర్సంపేట నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని, ప్రతిఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామంలో రూ.10లక్షలతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం MLA శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సర్పంచ్ చాగంటి మమత- తిరుమల్ తదితరులున్నారు.