TG: రైతులు పంటల మార్పిడికి ప్రయత్నించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పాలు, కోడిగుడ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడమే పరిష్కారం కాదన్నారు. 50 లక్షల టన్నుల కంటే ధాన్యం కొనలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పారు. పంట మార్పిడితో రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్రంతో మాట్లాడతామని అన్నారు.