TG: ప్రభుత్వం ప్రతి నెలా రూ.5535 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కోసం లక్ష 30 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రతి పంట సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. రూ.750 కోట్లతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించామని వెల్లడించారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.