ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రసిద్ధ రామప్ప దేవాలయం శిఖరంపై ఉన్న కలశాన్ని తాకుతూ ఉదయించే సూర్యుడు అపూర్వ దృశ్యాన్ని సృష్టించాడు. ఆ క్షణాన్ని ప్రధాన అర్చకుడు హరీశ్ శర్మ తన చరవాణిలో బంధించారు. భానుడి కిరణాలు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మరింత ప్రతిబింబింపజేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.