WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.