• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వార్డుల అభివృద్ధికి పాలకవర్గం కట్టుబడి ఉంది: మున్సిపల్ ఛైర్మెన్

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీ 2వ వార్డ్ పరిసర ప్రాంతాలలో మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ-శ్రీనివాస్ గురువారం పర్యటించారు. వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 12:35 PM IST

ప్రభుత్వసలహాదారును కలిసిన మున్సిపల్ చైర్మన్

NRML: పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తిలు హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణ సమస్యల పరిష్కారం కోసం అధిక నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తానని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు

March 5, 2026 / 12:34 PM IST

ప్రభుత్వ సలహాదారును కలిసిన మున్సిపల్ చైర్మన్

NRML: పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తిలు హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణ సమస్యల పరిష్కారం కోసం అధిక నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తానని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు

March 5, 2026 / 12:34 PM IST

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ ప్రావీణ్య

SRD: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

March 5, 2026 / 12:33 PM IST

ఎమ్మెల్యే శిరీషను కలిసిన ఏపీ టీపీసీ ఛైర్మన్

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు , వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పాల్గొన్నారు.

March 5, 2026 / 12:30 PM IST

నత్తనడకన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

NLG: జిల్లాలో వ్యవసాయ డిజిటలైజేషన్ లక్ష్యంగా సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం 60 శాతం మాత్రమే నమోదైందని, రిజిస్ట్రేషన్ లేకపోతే పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు అందవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ ఆధార్, పాసుపుస్తకం, మొబైల్ నెంబరుతో వెంటనే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.

March 5, 2026 / 12:30 PM IST

మార్చి 9న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల

కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితా ముసాయిదాను మార్చి 9న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. అర్హత కలిగిన వారు తమ పేర్లను పరిశీలించుకుని, తప్పులుంటే సవరించుకోవచ్చు. గ్రామ పంచాయతీల కాలపరిమితి ఏప్రిల్ 2తో గడువు ముగియనుంది.

March 5, 2026 / 12:30 PM IST

జిల్లాలో సెగలు పుట్టిస్తున్న ఎండలు

ASF: జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. మార్చ్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ పరిశీలకుడు అంబటి శివప్రసాద్ హెచ్చరించారు. ముఖ్యంగా మార్చి 5 నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 5, 2026 / 12:30 PM IST

ఒకే ఫ్రేమ్‌లో రవితేజ, విజయ్ దేవరకొండ

మాస్ మహారాజా రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముగ్గురు ఒకేచోట కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. మార్చి 4న జరిగిన విజయ్, రష్మిక రిసెప్షన్‌లో రవితేజ సందడి చేశాడు. వారికి కంగ్రాట్స్ చెప్పి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్, రవితేజ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

March 5, 2026 / 12:30 PM IST

గద్దలపైకి చేరుకున్న నాగులమ్మ, సడాలమ్మలు

MLG: మంగపేట మండలం లక్ష్మీ నరసాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగులమ్మ జాతరలో రెండవరోజు ముఖ్య ఘట్టం మొదలైంది. ఆదివాసీ పూజారులు గండోర్రె గుట్ట, ఎర్రెట్టల గుట్టల నుండి నాగులమ్మ, సడాలమ్మలను డోలు సన్నాయి వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలతో తీసుకొచ్చారు. ఆదివాసి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎదుర్కోలు నిర్వహించి, అభిషేకాలు నిర్వహించి, గద్దెలపై ప్రతిష్టించారు.

March 5, 2026 / 12:26 PM IST

వడ్డె ఓబన్న విగ్రహానికి రూ.50 వేల విరాళం

సత్యసాయి: అమడగూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహానికి డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడైన ఆయన రూ.50 వేల నగదును విగ్రహ కమిటీ సభ్యులకు అందజేశారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 5, 2026 / 12:26 PM IST

నరసింహుని సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పూజలు

SDP: పెండ్లిమర్రి మండలం వేయి నూతుల కోనలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని గురువారం కమలాపురం మాజీ MLA, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందచేసి శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు YCP నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 12:26 PM IST

ఇంటర్ పరీక్షకు సెట్ ‘ఏ’ ప్రశ్నపత్రం

KNR: నేడు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం-బి/ జువాలజీ /చరిత్ర పరీక్షకు బోర్డు అధికారులు సెట్ ‘ఏ’ పేపర్ ఎంపిక చేశారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 427, వొకేషనల్ విద్యార్థులు 252 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

March 5, 2026 / 12:25 PM IST

హోటల్ వెయిటర్ అనుమానాస్పద మృతి

GDWL: గద్వాల పట్టణంలోని ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న ఒడిశా యువకుడు సూరజ్ బెహరా (22) గురువారం అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై కళ్యాణ్ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూరజ్ మృతిపై తోటి సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 12:24 PM IST

రిటైర్డ్ ఉద్యోగులు కృష్ణా యూనివర్సిటీలో పనిచేసే ఛాన్స్

NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU)లో 70 ఏళ్లలోపు వయస్సున్న రిటైర్డ్ ఉద్యోగులతో 4 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక పద్ధతిన భర్తీ అయ్యే డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, అకాడమిక్ అడ్వైజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని KRU రిజిస్ట్రార్ తెలిపారు.

March 5, 2026 / 12:23 PM IST