• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విజయ్-రష్మిక రిసెప్షన్ లో మాజీమంత్రి ఎర్రబెల్లి

JN: విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉష దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ కుటుంబంతో తమకు ఆత్మీయ సంబంధం కొనసాగుతుందని తెలిపారు.

March 5, 2026 / 09:26 AM IST

14వ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

AP: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈరోజు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జేఎన్‌టీయూ సవరణ బిల్లును మంత్రి లోకేష్, మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును మంత్రి రాంప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.

March 5, 2026 / 09:24 AM IST

రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

HYD: నగరంలో భానుడి భగభగలకు తోడు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది మార్చి 3వ తేదీనే అనూహ్యంగా నమోదై అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. గత ఏడాది 2025 మే 6న నమోదైన 4,352 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ ఈసారి ఏకంగా 4,421 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.

March 5, 2026 / 09:24 AM IST

ఓవర్ స్పీడ్.. ధోనీకి ఫైన్!

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు MS ధోనీ కారుకు రాంచీ పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ఈ నెల 1న కాంకే రింగ్ రోడ్‌లోని బిర్సా వ్యవసాయ వర్సిటీ సమీపంలో అతని లగ్జర్ కార్ ఓవర్ స్పీడ్‌తో వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుపై చలానా జారీ చేశాయి. అయితే ఆ సమయంలో ధోనీ కారులో ఉన్నాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

March 5, 2026 / 09:24 AM IST

మన్నెగూడెం లో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

JGL: మేడిపల్లి మండలం మన్నెగూడెంలో కుట్టు శిక్షణ కేంద్రంను సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు కుట్టుపనిలో మెళకువలు నేర్పించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 09:23 AM IST

కెసిఆర్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు

KMM: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు రూ. 7,72,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందే ఈ ఆర్థిక సాయం ఒక వరం లాంటిదన్నారు.

March 5, 2026 / 09:23 AM IST

‘పదో తరగతి హాల్ టికెట్లు సిద్ధం.. డౌన్లోడ్ చేసుకోండి’

W.G: పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్‌సైట్, 9552300009 వాట్స్‌యాప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 5, 2026 / 09:22 AM IST

టమాటా ధర పతనం.. రైతుల ఆవేదన

అనంతపురం జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో టమాటా రూ.45 ఉండగా, బుధవారం అది రూ.6కు పడిపోయింది. ఈ ధర కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు టమాటాలను పొలాల్లోనే వదిలేస్తున్నారు.

March 5, 2026 / 09:20 AM IST

నేడే నామినేషన్లు.. బరిలోకి సింఘ్వీ, వేం నరేందర్

TG: రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం అభిషేక్ మను సింఘ్వీతో పాటు రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ అసెంబ్లీలో తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఈ అవకాశం దక్కడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

March 5, 2026 / 09:20 AM IST

జోరందుకున్న సాగు.. పెరిగిన యాసంగి విస్తీర్ణం

VKB: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 3,34,627 మంది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టగా, వరి సాగు విస్తీర్ణం గతంలో ఉన్న 75,838 ఎకరాల నుంచి ప్రస్తుతం 93,116 ఎకరాలకు చేరింది. ఇతర పంటలతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంపై వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 09:16 AM IST

లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తుకు అనుమతి

AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. A8 బూనేటి చాణక్య ఆస్తుల జప్తుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సిట్ ప్రతిపాదనలు పంపించింది. రూ.11.29 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది.

March 5, 2026 / 09:16 AM IST

‘డిమాండ్ ఉన్న పంటలతో రైతులకు మేలు’

MNCL: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఇంకా సాంప్రదాయ పంటలనే పండిస్తున్నారని అన్నారు. అయితే ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగం ఆధారంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేస్తే మేలు జరుగుతుందన్నారు.

March 5, 2026 / 09:15 AM IST

జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్ ఎన్నిక

ప.గో.జిల్లా జేఏసీలోని సభ్య సంఘాల నాయకులకు చోటు కల్పించడం హర్షనీయమని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి వర్మ, రామచంద్రరావు తెలిపారు. జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్‌గా STU జిల్లా కార్యదర్శి KV.రామచంద్రరావు, జిల్లా జేఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా జిల్లా అధ్యక్షులు PRVS సాయి వర్మలను ఏకగ్రీవంగా భీమవరంలో ఎన్నుకున్నట్టు గురువారం తెలిపారు.

March 5, 2026 / 09:14 AM IST

ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ అప్‌డేట్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తిరిగి మే నెలలో పట్టాలెక్కనుంది. సందీప్ వంగా పక్కా ప్లానింగ్‌తో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది.

March 5, 2026 / 09:12 AM IST

ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానంతో చర్చించి కొలిక్కి తెచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరిన్ని పోస్టుల ఆవశ్యకతను ఆయన వివరించారు.

March 5, 2026 / 09:12 AM IST