SRPT: సూర్యాపేటలో పొట్టిశ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్స్ నందు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై దుకాణాల వ్యాపారాలను ఇవాళ ఎస్పీ నరసింహ పరిశీలించారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహించే వారిని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వ్యాపారాలు సర్దుబాటు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎస్సై సాయి రామ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
KMM: ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ప్రశాంత్ నగర్, బాలాజీ నగర్, యుపిహెచ్ కాలనీలలో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలన్నారు.
PDPL: పెద్దపల్లి జిల్లా డీపీఈవో కార్యాలయంలో 2025-27 రిటైల్ మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణపై డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అంజన్ రావు సమీక్షించారు. దరఖాస్తుదారులకు సౌకర్యం కల్పించి, పాలసీ వివరాలు వ్యాపార సంస్థలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్సులు 01-12-2025 ລ້ 30-11-2027 2 అమలులో ఉండగా, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని క్లస్టర్ ఉందన్నారు.
MNCL: బెల్లంపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశించారు. శుక్రవారం మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టణంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ కమిషనర్ రమేష్, TPO, సంబంధిత ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
GDWL: ఎర్రవల్లి మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంను,10 th బెటాలియన్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి, పలు ప్రశ్నలను అడిగారు.
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జీఎస్టీ 2.Oపై విద్యార్ధులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇటువంటి పోటీల వలన జీఎస్టీ 2.Oపై విద్యార్ధులకు మరింత అవగాహన కలుగుతుందని ప్రిన్సిపాల్ డా.నాయక్ అన్నారు. జీఎస్టీ జీరో అయిన వాటికి మించి సామాన్యులకు ఆర్ధిక భద్రత కలిగించే ఆరోగ్య, జీవిత బీమా నిలుస్తుందని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కొయిల క్రాంతి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల BRS పాలనలో ఆర్టీసీ నాశనమైందని, ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు, 2.5% DA పెంచి, ఫ్రీ బస్సుతో మహిళల జీవితాలను మెరుగుపరిచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోందని ఆయన అన్నారు.
ADB: సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి కృషి చేయాలన్నారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో విధులను నిర్వర్తించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
SKLM: రైతుల పట్ల అలసత్వం వహించిన ఇరిగేషన్ అధికారులపై ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సేవలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
HYD: రెడ్ హిల్స్ వద్ద ఉన్న MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో డే కేర్ సేవలను ఇక జిల్లాలలో అందించడానికి సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల కొనసాగుతున్నట్లు ప్రొఫెసర్లు తెలిపారు. MNJ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు వర్చువల్ పద్ధతిలో పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పర్యవేక్షించి, అందరికీ వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.
KMR: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కురవృద్ధులు, బాన్సువాడ సమితి మాజీ అధ్యక్షులు, నిజాంసాగర్ మాజీ జడ్పిటీసి మల్లూరు కృష్ణారెడ్డిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆసుపత్రిలో పరామర్శించారు. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలన్నారు.
NRML: టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకుల ఆధ్వర్యంలో బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సంతోష్ రావు, మండల అధ్యక్షుడిగా భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా గౌతం, కోశాధికారిగా బండారి ఆనంద్ లను ఎన్నుకున్నారు. విలేకరులు నైతిక విలువలు పాటిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని నాయకులు సూచించారు.
NZB: రుద్రూర్ మండల కేంద్రంలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన మండల స్థాయి అంతర పాఠశాల క్రీడలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. ఈ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. విజేతలకు ఎంఈవో కట్ట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.
BDK: కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన గొగ్గలి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు. వారి దశదిన కర్మలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.
BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో “సమాచార హక్కు చట్టం – 2005” వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత సమయంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ చట్టం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో కీలకమని ఆయన అన్నారు.