• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

VIDEO: గిద్దలూరు సమస్యలపై CMను కలిసిన MLA ఆశోక్

ప్రకాశం: గిద్దలూరు MLA ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం అమరావతిలో CM చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని MLA విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందిస్తూ రోడ్ల అభివృద్ధికి రూ.5.60 కోట్లు విడుదల చేస్తున్నట్లు CM తెలిపారు. ఈ సందర్భంగా MLA సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.

March 5, 2026 / 10:20 AM IST

ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VKB: కొడంగల్ పట్టణంలో ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, CITU జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య తెలిపారు. CITU, SFI, DYFI, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారు.

March 5, 2026 / 10:20 AM IST

గాజువాక చేరుకున్న అంబటి రాంబాబు

VSP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గాజువాక చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఉడాకాలనిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగానే అంబటి రాంబాబును కలిసేందుకు తరలివచ్చారు. అంబటి రాంబాబు, కర్ణం ధర్మశ్రీ కొంతసేపు పార్టీ విషయాలు, ఇతర అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం.

March 5, 2026 / 10:19 AM IST

నష్టాలతో చీని చెట్లను తొలగిస్తున్న రైతులు

KDP: చీనీ సాగు రైతులకు కలసి రావడం లేదు. సాగులో నష్టాలు తప్ప లాభాలు రాకపోవడంతో దీర్ఘకాలిక పంటలతో ఆదాయం ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వేముల మండలంలో 2 వేల ఎకరాల్లో రైతులు చీని సాగు చేసినట్లు తెలిపారు. భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంవల్ల చీని చెట్లు వాడులేక పూత రావడం లేదన్నారు. సాగులో నష్టాలు వస్తున్నాయన్నారు. దీంతో చేసేదేమిలేక చెట్లను తొలగిస్తున్నారు.

March 5, 2026 / 10:17 AM IST

హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

TG: హిస్సార్ ఎక్స్‌ప్రెస్(22737)కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివారులో రైల్ ఇంజిన్ వీల్ విరిగిపోయింది. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపి మరో ఇంజిన్ సహాయంలో ఉప్పల్(కమలాపూర్)కు తీసుకెళ్లారు. మరమ్మతుల అనంతరం రైలు సికింద్రాబాద్‌కు చేరుకుంది. ఇందుకోసం ఈ ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి ఉప్పల్‌లో 2 గంటలపాటు నిలిపేశారు.

March 5, 2026 / 10:15 AM IST

కొడుకును నరికి చంపిన తండ్రి

NZB: జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. గంజాయికి అలవాటు పడి నిత్యం వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల భాను ప్రకాష్ (23) మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తుండేవాడు. నిన్న రాత్రి కూడా ఇబ్బంది పెట్టడంతో విసిగిపొయిన తండ్రి కిషన్‌ను నరికి చంపాడు.

March 5, 2026 / 10:13 AM IST

RRR కస్టడీ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన అధికారి

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీయల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. సునీల్ నాయక్‌ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించనున్నారు.

March 5, 2026 / 10:11 AM IST

పొంచి ఉన్న ప్రమాదం…

BHNG: భూదానోపోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో రోడ్డు పక్కన గల వ్యవసాయబావి ప్రమాదకరంగా ఉంది. బావి చుట్టూ ఎలాంటి రక్షణ కంచె లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఉన్న బావిని పూడ్చి వేయాలని లేదా బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

March 5, 2026 / 10:11 AM IST

రజినీకాంత్, షారుఖ్ ఖాన్‌ కాంబోలో మూవీ?

రజినీకాంత్, షారుఖ్ ఖాన్‌ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తన ‘డ్రీమ్ కాంబినేషన్’ గురించి మాట్లాడుతూ, రజినీ, షారుఖ్‌లను ఒకే తెరపై చూడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. వీరికి సంగీతం అందించడం తన కెరీర్‌లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అన్నాడు. దీంతో నెటిజన్లు ఈ కాంబో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

March 5, 2026 / 10:08 AM IST

బాల్య వివాహ అవగాహన కార్యక్రమం

NRPT: దామరగిద్ద మండలం నర్సాపూర్లో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్న వయసులో పెళ్లి వల్ల కలిగే ప్రమాదాలు, అనర్థాలను వివరించారు. మహిళలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించి, ఏ సమస్య ఎదురైతే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేయమని వాలంటీర్ రూపిక సూచించారు.

March 5, 2026 / 10:08 AM IST

రేపు మైదుకూరులో జాబ్ మేళా

KDP: మైదుకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓబులరెడ్డి ఇవాళ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జాబ్ మేళాకి విద్యార్హత పత్రాలు తీసుకురావాలని సూచించారు.

March 5, 2026 / 10:07 AM IST

జిల్లాలో పెరిగిన క్రయవిక్రయాలు!

VKB: జిల్లాలోని భూములు, ప్లాట్లు ఇతర విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ. 54.56 కోట్లు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్ లో రూ. 27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్‌లో రూ. 6.5 కోట్ల ఆదాయం సమకూరింది.

March 5, 2026 / 10:07 AM IST

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది: మంత్రి

AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని మంత్రి గొట్టిపాటి అన్నారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘200కు పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్ల డిమాండ్ ఉంది. వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. విశాఖలో భూగర్భ కేబుల్‌పై ప్రతిపాదన పరిశీలిస్తున్నాం. పరిశ్రమలు, వ్యవసాయం కనెక్షన్లు పెరుగుతున్నాయి’ అని వెల్లడించారు.

March 5, 2026 / 10:06 AM IST

బిజ్వార్ జడ్పీహెచ్ఎస్‌లో స్వయం పరిపాలన దినోత్సవం

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్ జడ్పీహెచ్ఎస్లో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటివారికి పాఠాలు బోధించారు. ఎస్బీఐ మేనేజర్ నర్సింహులు విద్యార్థులను పరీక్షల్లో మెలకువ పాటించమని.. ఉన్నత చదువులకు విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

March 5, 2026 / 10:06 AM IST

ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం.. భక్తుల ఆగ్రహం!

MBNR: కౌకుంట్ల మండలం ముచ్చింతల వాగు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు కలకలం సృష్టించారు. స్వామివారి విగ్రహం కాలును ధ్వంసం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ అపచారానికి ఒడిగట్టిన వారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

March 5, 2026 / 10:05 AM IST